హొళగుంద పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఆలూరు సిఐ
హొళగుంద, న్యూస్ వెలుగు; ఆలూరు సిఐ బి . వెంకట చలపతి హొళగుంద పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లోని మంగళవారం పలు రికార్డులను పరిశీలించి, వివిధ కేసుల యొక్క వివరాలను తెలుసుకొని, స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మట్కా బీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. మట్కా వ్రాయడం, నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాల నరసింహులు ట్రైనింగ్ ఎస్సై మెహబూబ్ భాష పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!