ఆలూరు టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ కు కేటాయించడం పట్ల హర్షం

ఆలూరు టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ కు కేటాయించడం పట్ల హర్షం

హోళగుంద,న్యూస్ వెలుగు:ఆలూరు తాలూక టీడీపి ఇంచార్జీగా వీరభద్ర గౌడకు బుధవారం అధిష్ఠానం భాద్యతలు ఇవ్వడంతో మండల టీడీపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం స్థానిక బస్టాండ్ నందు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసి కట్టుగా పార్టీని ముందుకు నడిపిద్దామన్నారు.అలాగే ఆలూరు తాలూక ఇంచార్జీగా వీరభద్ర గౌడకు భాద్యతలు ఇవ్వడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా ఆలూరు టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌదకు ఇవ్వడం పట్ల బుడగ జంగాల కాలనీ నందు కూడా టీడీపి నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పంపాపతి,వీరన్న గౌడ,మురళీ,కాడ సిద్దప్ప,ఎర్రి స్వామి,బసవ,అంజి,మోహిన్,దిడ్డి వెంకటేష్,దుర్గయ్య,జాకీర్,తిప్పన్న,జంగల రామంజిని, మారెప్ప,రామయ్య,తిమ్మ రెడ్డి,చినిగి సాబ్,గిడ్డయ్య,భక్షి,వీరభద్రయ్య స్వామి,అతరహిమాన్,మంగయ్య,మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!