
అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు : అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో జిల్లా యంత్రాంగం సమిష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందుభాగాన్ని ఆకర్షణీయంగా

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం రాజధాని లేని పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రధాన లోటుగా నిలిచిందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్పబలం, అలాగే ప్రజల సమగ్ర భాగస్వామ్యంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రక్రియకు బలమైన పునాది ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. గ్రామాల నుండి పట్టణాల వరకు, ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని కలెక్టర్ తెలిపారు. అమరావతి కేవలం రాజధాని నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ఆధునిక మౌలిక సదుపాయాల సమాహారంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే కేంద్రబిందువుగా అమరావతి నిలుస్తుందని అన్నారు. అలాగే ఈ చారిత్రాత్మక సందర్భాన్ని సాధ్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఘట్టంలో భాగస్వాములైనందుకు గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా కలెక్టరేట్లో కూడా జిల్లా యంత్రాంగం సమిష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా అమరావతి కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

