నిలిపివేసిన అమర్‌నాథ్‌ యాత్ర

నిలిపివేసిన అమర్‌నాథ్‌ యాత్ర

News Velugu Update: భారీ వర్షం కురుస్తున్నందున అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు . ప్రతికూల వాతావరణం దృష్ట్యా, యాత్రికులను బేస్ క్యాంపుల నుండి ట్రాక్‌లపైకి వెళ్లడానికి అనుమతించలేదని న్యూస్ వెలుగు  కరస్పాండెంట్ నివేదించింది. యాత్ర మార్గాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

   కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్ రేపు జూలై 31, 2025న జమ్మూలోని భగవతి నగర్ నుండి నిలిపివేసినట్లు పేర్కొన్నారు . యాత్ర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా, బేస్ క్యాంపుల నుండి యాత్రికుల కదలికపై ప్రభావం పడింది. జూలై 31, 2025న భగవతి నగర్ జమ్మూ నుండి బాల్తాల్ మరియు నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎటువంటి కాన్వాయ్ కదలికను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు.   ఇప్పటివరకు   3.93 లక్షలకు పైగా యాత్రికులు పవిత్ర గుహ మందిరంలో సందర్శించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS