కల్లూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలోఅంబేద్కర్ వర్థంతి కార్యక్రమం

కల్లూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలోఅంబేద్కర్ వర్థంతి కార్యక్రమం

న్యూస్ వెలుగు, కర్నూలు; అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాన్ని కర్నూలు లోని కల్లూరులో ఎమ్మార్పీఎస్, ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. కల్లూరు లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘల నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చేసిన సేవా కార్యక్రమాలను విద్యార్థులకు వారు తెలియజేశారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు అందరూ సమాన హక్కులు అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాలు సైతం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని పోవాలని ఆయన కోరారు. యం.ఎస్.పీ.కర్నూలు నగర ఇంచార్జ్ పాముల కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కి మరణం లేదని ఆయన ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాముల కుమార్, హుస్సేన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!