అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకలు

అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకలు

కర్నూలు: అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ ఫర్ డిసేబిలిటీ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, హేమ్చంద్ దేవ్చంద్ ఛారిటీస్ ట్రస్ట్, కర్నూలు డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 2 రోజుల రాష్ట్ర CRE వర్క్ షాప్ ను 2024 ఆగస్టు 2 మరియు 3 తేదీల్లో నిర్వహించారు అనంతరం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మరియు ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం (ISAA టూల్)పై ప్రారంభ కార్యక్రమం 2024 ఆగస్టు 2వ తేదీన అంబికా శిశు కేంద్రం బ్లాక్-IIలో వేడుకలు నిర్మించినట్లు తెలిపారు.అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకల ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్, డాక్టర్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అంబికా శిశు కేంద్రంలో అందిస్తున్న సేవలను డా.సి.ప్రభాకర్ రెడ్డి కొనియాడారు మరియు ఆటిజం కోసం మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అర్హత కలిగిన వైద్య నిపుణులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.అంబికా శిశు కేంద్రం చేపట్టిన ఆటిజమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు సరైన వైద్య ధృవీకరణ పత్రం అందజేసేందుకు కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుందని, అందుకు జిల్లా పాలనా యంత్రాంగం కృషి చేస్తుంది అని DRO శ్రీ కె.మధుసూధన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ కె.మధుసూధన్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి మరియు డా.సి.ప్రభాకర రెడ్డి ,సూపరింటెండెంట్, ప్రభుత్వం సర్వజన వైద్యశాల కర్నూలు, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి.రైస్ ఫాతిమా, అంబికా శిశు కేంద్రం డైరెక్టర్ శ్రీమతి బిందు , శ్రీమతి.కృష్ణవేణిరి, డా.సరోజ ఆర్య, వి.ఆర్.పి.శైలజారావు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!