కురువ పార్వతి ది ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుంది.. కురువ సంఘం
న్యూస్ వెలుగు కర్నూలు: మంత్రాలయం మండలం రచ్చుమర్రి మోడల్ స్కూలు నందు పదవ తరగతి చదువుతున్న పార్వతి హత్య అని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోషియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ప్రదానకార్యదర్శి ఎం .కే . రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ పేర్కొన్నారు . బాలిక ఒంటిపై గాయాలయ్యాయి కాని అధికారులు అవేవి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మీకు తగదు. నిష్పక్షపాతంగా వ్యవహరించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్యాన్ బాలికకు అందే పరిస్థితి లేక పోయినా ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం సిబ్బంది పోలిసులు చేయడం విడ్డూరంగా ఉంది. తల్లిదండ్రులకు ప్రభుత్వం 50 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బూదూరు లక్ష్మన్న కోత్తపల్లి దేవేంద్ర మంత్రాలయం మండల అధ్యక్షులు మల్లికార్జున వీరనాగప్ప తదితరులు పాల్గొన్నారు.