పూర్వ విద్యార్థుల ‘అపూర్వ’ కలయిక
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 పదవ తరగతి విద్యాసంవత్సరానికి సంబంధించి పూర్వ విద్యార్థులు ఆదివారం పత్తికొండ పట్టణంలోని ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రతాపరెడ్డి స్వగృహంలో కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో నవంబర్ 3వ తేదీన ఆదివారం ఉదయం 9గంటలకు ఆర్ఎస్ పెండేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక సమావేశాన్ని దాదాపు 31 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే తమ తోటి విద్యార్థులు 12 మంది తమ మధ్యలో లేరని వారు ఇప్పటికే వివిధ కారణాలవల్ల స్వర్గస్తులయ్యారని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగిందన్నారు. ఇక మిగిలిన విద్యార్థులు అందరూ తప్పనిసరిగా నవంబర్ 3వ తేదీ జరిగే పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక సమావేశానికి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశ అనంతరం హాజరైన పూర్వ విద్యార్థులందరికీ చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసిన ప్రతాపరెడ్డి కుటుంబానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభాష్ చంద్రబోస్, రామయ్య, తిరుపాల్, ప్రతాప్ రెడ్డి, దామోదర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మార్కండేయులు, చాంద్ భాష, ఈశ్వరయ్య, చాణిక్య, నాగేంద్ర, రంగన్న, లక్ష్మిరెడ్డి, మహేష్ రెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, సుధాకర్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.