ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేబినెట్‌ ఆమోదం

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేబినెట్‌ ఆమోదం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి  రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు  కేంద్ర కేబినెట్‌  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2.245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించారు.

అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా కు అనుసంధానిస్తూ కొత్త రైల్వేలైన్‌ను ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  వెల్లడించారు. ఈ రైల్వేలైన్‌ ద్వారా కాజీపేట మీదుగా నాగ్‌పూర్‌, ఢిల్లీ వరకు అమరావతికి ప్రత్యక్ష అనుసంధానం ఉంటుందని తెలిపారు.

అమరలింగేశ్వర స్వామి, ధ్యానబుద్ధ, అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా రైల్వేలైన్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ లైన్‌ద్వారా దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా కృష్ణానదిపై 3.2 కి.మీ పొడవైన కొత్త రైల్వే వంతెన నిర్మాణం చేపడుతామని ప్రకటించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!