
కోళ్ల షెడ్లను పరిశీలించిన ఏపీడి ,ఎంపీడీవో
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల్లో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీల్లో కోళ్ల పెంపక షెడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన కోళ్ల పెంపక షెడ్ల నూతన నిర్మాణాలను మంగళవారం ఎంపీడీవో ప్రసాద్, ఏపీ డి సోమశేఖర్ రెడ్డి ఉపాధి సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మంజూరైన కోళ్ల పెంపక షెడ్లు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!