ఉమ్మడి జిల్లా ” కురువ” విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల దరఖాస్తులు ఆహ్వానం

ఉమ్మడి జిల్లా ” కురువ” విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల దరఖాస్తులు ఆహ్వానం

కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు నగరం లోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం ఉదయం కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఇవ్వవలెనని తీర్మానించడమైనది. ఈ ఏడాది 2024-25 నందు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం వారు పురస్కారాలకు ఆహ్వానం పలుకుతన్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవాధ్యక్షులు కె. కిష్టన్న,జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రదానకార్యదర్శి అనిత ఉపాధ్యక్షులు బి.వేంకటేశ్వర్లు, కె ధనుంజయ కోశాధికారి కె.సి. నాగన్న సహాయ కార్యదర్శి కోత్తపల్లి దేవేంద్ర, బి. సి. తిరుపాల్, తవుడు శ్రీనివాసులు పాల సుంకన్న, బి. సి.తిరుపాల్, పిలుపునిచ్చారు .ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాసులు మాట్లాడుతూ పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు 500 పైగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారు 550 పైన మార్కులు వచ్చిన వారు అప్లై చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాల లో చదివిన విద్యార్థులు 850 మార్కులు, ప్రైవేటు కళాశాల చదివిన విద్యార్థులు 900 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు తమ మార్కుల మెమోను, కులం సర్టిఫికెట్,జిరాక్స్ కాపీని తేదీ: 05-05-2025 లోగా ఈ క్రింద తెలిపిన వాట్సప్ నెంబర్లకు 9440756199, 9032741194 పంపగలరు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు పెద్దపాడు పుల్లన్న, బి. బాలరాజు, కె. మద్దిలేటి, నగర సంఘం కోశాధికారి కె. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!