
పత్తికొండ టౌన్ ఉపాధ్యక్షుడిగా సుల్తాన్ అబ్దుల్లా నియామకం
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు
పత్తికొండ/ తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: స్థానిక పత్తికొండ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఇందిరా భవన్ లో నియోజకవర్గ ఇంచార్జి క్రాంతి నాయుడు సమక్షంలో ముస్లిం వీధి, బండిగేరి కి సంబంధించిన సుల్తాన్ అబ్దుల్లా పార్టీ లో చేరడం జరిగింది. అబ్దుల్లా ను పత్తికొండ టౌన్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, వారితో పాటు అక్కడ నివాసం ఉంటున్న పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరాయి. పత్తికొండ టౌన్ లో ముస్లిం మైనారిటీ జనాభా ఎక్కువ ఉన్నా వారికి సరైన ప్రాతినిధ్యం లేదు, అందుకే రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వారికి సరైన న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు క్రాంతి నాయుడు అన్నారు. వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర గలిగిన పత్తికొండ లో ఒక పార్క్ లేదు, రిక్రియేషన్ సెంటర్ లేదు, పిల్లలకు, వృద్దులకు ఒక సెంటర్ లేదు, యువతకు జిమ్, గ్రౌండ్, ట్రాక్ లాంటి సదుపాయాలు లేవు, వీధుల్లో ఎన్నో ఇబ్బందులు. పత్తికొండ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ప్రజలు కనీసం త్రాగు నీరు లేక ఇబ్బంది పడే పరిస్తితి (టాప్ నీరు తాగలేక ఫిల్టర్ నీరు కొనే దుస్థితి), సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బంది పడే పరిస్తితి, ఇక్కడ విస్తారమైన రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్తితి, కోట్ల రూపాయలు నిధులు వస్తున్నా అభివృద్ది కి నోచుకోని పరిస్తితి వీటన్నిటి పైన గళం వినిపించడానికి ముందుకు వచ్చిన యువతను అభినందించాలి అని వారు కోరారు, ఈ నెల 22న టౌన్ అధ్యక్షుడిని, మండల కమిటీలను కర్నూలు లో జరిగే కార్యక్రమంలో ప్రకటిస్తాం అని తెలియజేశారు. కార్యక్రమంలో నూర్ బాషా, మహబూబ్ బాషా, మస్తాన్ వలీ, పోతుల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.