
రోడ్డు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సు నెం.KA37F 0711, గంగావతి-మంత్రాలయం మార్గమధ్యంలో పెద్ద తుంబలం గ్రామ సమీపాన రెండు మోటార్ సైకిళ్ళను డీ కొట్టడం జరిగింది. దాని ఫలితంగా ఒక మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మర్కొరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. రెండవ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు కుప్పగళ్ గ్రామస్తులు కాగా, ముగ్గురు మాన్వి గ్రామస్తులు.ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే, ఎ.పి.యస్.ఆర్.టి.సి. బోర్డు డైరక్టరు మరియు కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ప్రభుత్వంతోను, పోలీసు అధికారులతోను మరియు కర్ణాటక ఆర్టీసీ అధికారులతోను మాట్లాడి, మరణించిన కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందించమని ఆదేశాలు ఇవ్వడమైనదని పూల నాగరాజు తెలియజేశారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar