ఎపి జెఎసి రాష్ట్ర కార్యదర్శిగా ఆప్టా కాకి ప్రకాష్ రావు
విజయవాడ, న్యూస్ వెలుగు; విజయవాడ లో జరిగిన ఎ పి జె ఎ సి రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక లో కర్నూలు జిల్లా కర్నూలు మండలము ఎం పి పి ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గా పని చేయుచున్న కాకి ప్రకాష్ రావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది.ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వున్న కాకి ప్రకాష్ రావు ఉపాధ్యాయ సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ మొట్టమొదట సారిగా ఆప్టా సంఘం నుండి ఎ పి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయినందున ఆప్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సేవలాల్ నాయక్, జిల్లా కోశాధికారి వినోద్ కుమార్, ఆప్టా రాష్ట్ర నాయకులు మునగాల మధుసూదన్ రెడ్డి, రాజసాగర్, గోపాల్, ఖాదీరుల్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియ చేసారు.
Was this helpful?
Thanks for your feedback!