జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంపై ఏపీయూడబ్ల్యూజే హర్షం

జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంపై ఏపీయూడబ్ల్యూజే హర్షం

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ ఇస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, డీఈఓ శామ్యూల్ పాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జీ కొండప్ప, కే నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ వీ సుబ్బయ్య, గౌరవ సలహాదారులు వైవీ కృష్ణా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ. సుంకన్న, కోశాధికారి అంజి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు హరికిషన్, మధుసూధన్ గౌడ్, హుస్సేన్ జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు అవినాష్, శివ రాజ్ కుమార్, వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. చాలీ, చాలని వేతనాలు వస్తున్నా సమాజం పట్ల అంకిత భావం భావంతో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను, అక్రమాలను, మూఢనమ్మకాలను, సామాజిక అసమానతలను తదితర అన్ని రకాల సమస్యలను ఎప్పటికప్పుడు జర్నలిస్టులు వెలుగులోకి తెస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా విద్యను అందించలేక పోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ తో పాటు ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ స్కూల్స్ ఉచిత విద్య అందించాలని ఏపీయూడబ్ల్యూజే గా కోరడం జరిగింది. తమ విన్నపాన్ని మన్నించి జర్నలిస్టుల పట్ల సహృదయం తో కర్నూలు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు మొత్తం ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని కలెక్టర్ రంజిత్ భాష, డీఈఓ శామ్యూల్ పాల్ గారు ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ ఆదేశాలు జర్నలిస్టుల పిల్లలకు కొంత ఊరట కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు, డీఈఓ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, చిరంజీవి, వీడియో జర్నలిస్టు లు స్నేహల్, కిరణ్, చంద్ర శేఖర్ తదితరుల పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!