ఆలూరు అభివృద్ధిపై ఏపీడబ్ల్యూజే సెమినార్ కార్యక్రమం
ఆలూరు, న్యూస్ వెలుగు: నియోజకవర్గంలో స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు ఆదివారం ఏపీడబ్ల్యూజే సంఘం ఆధ్వర్యంలో ఆలూరు అభివృద్ధిలో మీడియా ప్రజా ప్రతిధుల,అధికారుల పాత్ర పై సెమినార్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూల్ ఎంపీ పంచలింగాల నాగరాజు,రిటైర్డ్ ఐఏఎస్, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు,ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్,ఆలూరు బిజెపి ఇంచార్జ్ వెంకటరమణ,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య,ఏపిడబ్ల్యూజే(ఐజేయు) కొండప్ప,నాగరాజు,ఏపీడబ్ల్యుజే సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ,ఏపీడబ్ల్యుజే సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ ముద్దుబిడ్డగా నేను ఎల్లప్పుడూ ఆలూరు అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పారు.టిడిపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు సాగు మరియు తాగునీటి సమస్యలు తలెత్తకుండా హంద్రీనీవా,వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ప్రజలు వలస వెళ్లకుండా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న రహదారుల సమస్యల పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు.పత్తికొండ డిఎస్పీ మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే శాంతియుత వాతావరణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు గుమ్మనూరు నారాయణ,కురువ జయరాం,జమాపురం బసవ, తిమ్మరెడ్డి,వన్నూరప్ప, హెబ్బటం మాజీ జడ్పీటిసి అయ్యాలప్ప,లక్ష్మయ్య,ఆరు మండలాల ప్రజా ప్రతినిధులు,కూటమి పార్టీ నాయకులు,ఆరు మండలాల ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.