
రాష్ట్రవ్యాప్తంగా అరకు కాఫీ దుకాణాలు ..!
విశాఖపట్నం (న్యూస్ వెలుగు ): రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అరకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్ధ(జీసీసీ) అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగుమ్మిడిసంధ్యారాణి ఆదేశించారు. మంగళవారం విశాఖపట్నంలోని జీసీసీ కార్యాలయంలో ఆయా అధికారులతో పత్ర్యేక సమావేశం నిర్వహించిన మంత్రిఅరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు, దుకాణాల నిర్వహణ, గిరిజన రైతుల సంక్షేమం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ… అరకు కాఫీకి ఇప్పటికే పపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పత్ర్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేందంలో దుకాణాలు ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. జీసీసీ కార్యకలాపాలపై విస్తృత పచారం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.