
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి మండలి సమావేశాల కోసం ఇ-క్యాబినెట్ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. బుదవారం నుంచి ప్రారంభమయ్యే సభ సమావేశాలను ఉదయం 11 గంటలకు షెడ్యూల్ చేయబడినట్లు వెల్లడించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) చే అభివృద్ధి చేయబడిన ఈ కొత్త వ్యవస్థ మంత్రుల సమావేశాలను కాగితం రహిత మార్చడం, సమర్థత మరియు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇ-క్యాబినెట్ అప్లికేషన్ క్యాబినెట్ పత్రాలు మరియు చర్చలను యాక్సెస్ చేయడానికి సురక్షితమైన, ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అద్యయనం చేసినట్లు వెల్లడించారు. సభలో మంత్రులకు కావాల్సిన సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను వృద్ది చేసినట్లు అయన వెల్లడించారు. సమవేసంలోని రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి వాటిని సులువతరం చేయడం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ నిర్ణయాలను అందుబాటులోకి తిసుకోచ్చేల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.