కార్పొరేట్ స్థాయిలో సి. యస్ .ఐ క్యాంబెల్ హాస్పిటల్ వైద్యం
340 పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి .ఏ. అగస్టిన్ రాజ్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని సి యస్ ఐ క్యాంబెల్ హాస్పిటల్ రాయలసీమలోనే ప్రధమంగా 120 సంవత్సరాలకు పై బడి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ఘనత మన సి యస్ ఐ క్యాంబెల్ ఆసుపత్రికి చెందినది. జమ్మలమడుగు పరిసర ప్రజలు ముద్దుగా పెద్ద ఆసుపత్రిగా పిలుచుకునే ఈ ఆసుపత్రి అత్యవసర సమయాల్లో ముందుగా గుర్తొచ్చే ఆసుపత్రి క్యాంబెల్ హాస్పిటల్ మాత్రమే చెప్పడంలో సందేహం లేదు. దానికి గల కారణం ఏ సమయంలో అయినా ఏ వైద్యానికైనా అన్ని విధాలుగా ప్రజలకు సహకరిస్తూ నాణ్యమైన వైద్యాన్ని అందించడమే అని సూపరింటెండెంట్ డాక్టర్ జి. ఎ. అగస్టిన్ రాజ్ పేర్కొన్నారు. ఆయన పల్లెవాణి దినపత్రికతో మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు ,కర్నూల్ ,తిరుపతి, కడప తదితర పట్టణాలకు ప్రజలు వెళ్లవలసిన అవసరం లేకుండా జమ్మలమడుగు పట్టణంలోని కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అత్యాధునిక పరికరాలతో అందిస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల వ్యాధులకు అనుభవం గల డాక్టర్ల చేత అనునిత్యం రోగుల క్షేమాలను పర్యవేక్షణం చేయడం జరుగుతున్నది అని అలాగే ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ సైతం మంచిగా పని చేసి ఆసుపత్రికి ఉన్న మంచి పేరు కాపాడుకుంటూ రావడంలో మంచి పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. ఈ ఆసుపత్రి నందు స్కానింగ్ నుండి మొదలు అన్ని వైద్య సేవలు ఆసుపత్రిలోనే జరుగుతాయని బయటికి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం ఉండదు అన్నారు. ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్ అందుబాటులో ఉన్నవి వీటి వలన పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్న డాక్టర్స్
1)జనరల్ మెడిసిన్- డాక్టర్అగస్టిన్ రాజ్
(మెడికల్ సూపర్డెంట్ )
2)అప్తాల్మలాజీ -డాక్టర్ రవిద్ర &డాక్టర్ వినంమృత
3)ENT- చెవి, ముక్కు, గొంతు.. డాక్టర్ ప్రతుషా
4)జనరల్ సర్జరీ-డాక్టర్ సందీప్&డాక్టర్ పవన్ కుమార్
5)ఆర్థోపిడిక్-డాక్టర్ మోహిసిన కమల్
6)గైనకాలజిస్ట్- డాక్టర్ జయసత్య
7)పీడియాట్రిక్-డాక్టర్ మొయిజ
8)పల్మోనాలజి-డాక్టర్ అబూబకర్ సిద్దిక్
9)డెంటల్- డాక్టర్ మనోజ్ కుమార్..
ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించిన ఆసుపత్రి
క్యాంబెల్ ఆసుపత్రి నందు ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించారు. వైయస్ రాజారెడ్డి జయమ్మ దంపతులకు కుమారుడైన మాజీ సీఎం దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మించింది ఈ ఆసుపత్రిలోనే, అంతేకాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆసుపత్రి నందు డాక్టర్ గా విధులు కూడా నిర్వహించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతుల సంతానం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల కూడా క్యాంబెల్ ఆస్పత్రిలోనే జన్మించడం జరిగింది.