మండల అధ్యక్షులుగా అట్లా గోపాల్ రెడ్డి

మండల అధ్యక్షులుగా అట్లా గోపాల్ రెడ్డి

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుగ్గలి మండల అధ్యక్షులుగా అట్ల గోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.మండల పరిధిలోని గల పెండేకల్ గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు,మారెళ్ళ సింగల్ విండో మాజీ అధ్యక్షులు అట్లా గోపాల్ రెడ్డికు వైఎస్ఆర్సిపి పార్టీ మండల అధ్యక్షులుగా పదవి ఇస్తూ వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం నుండి గురువారం రోజున ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వైయస్సార్సీపి మండల అధ్యక్షులుగా ఎన్నికైన అట్లా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కు, జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు మరియు మండల వైఎస్ఆర్సిపి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. మండలంలోని అందరి వైసీపీ నాయకుల మరియు కార్యకర్తల సమన్వయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని గల వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అట్లా గోపాల్ రెడ్డి కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!