డిటోనేటర్లతో ఇంటిపై దాడి – వీఆర్ఏ మృతి
వేముల , న్యూస్ వెలుగు;కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలంలోని వి. కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వీఆర్ఏ నరసింహ ఇంటిపై డిటోనేటర్లతో దాడి జరిగింది. వీఆర్ఏ నిద్రిస్తున్న ప్రాంతంలో డిటోనేటర్లు పేల్చడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన సతీమణికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెను చికిత్స నిమిత్తం కడపకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్న డిటోనేటర్లు పేలయా?.. లేక బయట వ్యక్తులు వీఆర్ఏ ను చంపేందుకే ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడి సంఘటనలో వీఆర్ఏ నరసింహ మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన సతీమణిని కడప కు తరలించారు. సంఘటన తెలిసిన వెంటనే పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ఈ సంఘటనలతో సంబంధం ఉన్న అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. గ్రామంలో పోలీసుల బందోవస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.