హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని కొత్తపేట,నేరణికి తండా

కొండల్లో మంగళవారం తెల్లవరుజామున ఎస్ఐ బాల నరసింహులు,ట్రైనింగ్ ఎస్ఐ మహబూబ్ భాష,సిబ్బందితో కలిసి నాటు సారా స్థావరాల పై దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా నాటు సారా 800 లీటర్లు బట్టిలను ధ్వంసం చేశారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా దొంగ చాటుగా నాటు సారా విక్రయిస్తే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Thanks for your feedback!