
కాంప్లెక్స్ సమావేశాలకు వెళ్ళకుండా అడ్డు…
పోలీసుల చొరవతో సహకరించిన గ్రామస్తులు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఇంగలదహల్ గ్రామంలో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను కాంప్లెక్స్ గా యథావిధిగా కొనసాగించాలని ఇంగలదహల్,ఎం.డి.హళ్లి.పెద్దగోనెహాల్, వందవాగిలి,గజ్జెహళ్లి పాఠశాల విద్యాకమిటి సభ్యులు,గ్రామ సర్పంచ్లు,గ్రామ పెద్దలు,యూత్ సభ్యులు కోరుతూ శనివారం నిర్వహించే కాంప్లెక్స్ సమావేశానికి వెళ్ళకుండా ఉండాలని ఇంగలదహల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందజేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఉపాధ్యాయులను సమావేశాలకు వెళ్ళకుండా అడ్డుకోవడంతో ఎలాగైనా సమావేశానికి హాజరు కావాలని కోరడంతో పోలీసుల సహకారంతో వెళ్లడం జరిగింది.కానీ ఎస్ఐ బాలనరసింహులు,ఎం.ఈ.ఓ, డి.ఈ.ఓలతో మాట్లాడివ్వడం జరిగింది.ఈ పాఠశాల కూడా చాలా పురాతన మైనది అలాగే 7.65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.అలాగే గదులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని తెలియజేశారు.డి.ఈ.ఓ కూడా సానుకూలంగా స్పందించి పాఠశాలను ఒకసారి ఒక టీం గా ఏర్పడి పాఠశాలను పరిశీలిస్తామని ఆ తరువాతనే ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని తెలియజేశారు.అదేవిధంగా కాంప్లెక్స్ ను యథావిధిగా కోనసాగించకపోతే అన్ని గ్రామస్తులను కలుపుకుని ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామల సర్పంచ్లు వెంకటరామిరెడ్డి,శేషప్ప, ప్రమీదవతమ్మ,ఎంపీటీసీ మల్లికార్జున,పాఠశాల విద్యాకమిటి ఛైర్మన్లు ఉరుకుందు,దస్తగిరి,మహేష్,కొండయ్య,సునీత,విరేష్ గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి,ఉల్లేష్,హనుమంతు,మల్లేష్,ఈరన్న,యూత్ అసోసియేషన్ సభ్యులు శేఖర్,బోడి,రఫీ,మహనంది, హనుమంతు,రాజు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.