దేవరగట్టు బన్నీ ఉత్సవాల పై అవగాహన సదస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఈ నెల 12వ తేదీ జరిగే బన్ని ఉత్సవాల పై నేరణికి గ్రామంలో తహసీల్దార్ ప్రసాద్ రాజ్,ఎస్ఐ బాల నరసింహులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు కూడా ఇనుప తొడగిన రింగు కర్రలను దేవరగట్టుకు తీసుకురాకూడదని మరియు నిప్పులు రింగులను జనాల పైన విసరకూడదని అలా చేసిన వారి పై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ముఖ్యంగా ఉత్సవాలను ప్రజలందరూ భక్తి భావంతో జరుపుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్వేయర్ శ్రీనివాసులు,విఆర్వోలు నాగరాజు,రెవిన్యూ సిబ్బంది నరసప్ప,పోలీస్ సిబ్బంది గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!