మినీ గోకులం లబ్ధిదారులకు అవగాహన

మినీ గోకులం లబ్ధిదారులకు అవగాహన

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకుఅనుగుణంగా మినీ గోకులాల నిర్మాణాలు చేపట్టాలని బండి ఆత్మకూరు ఎంపీడీవోదస్తగిరి తెలిపారు.మంగళవారం మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఏపీఓ వసుధ ఆధ్వర్యంలో మినీ గోకులాల లబ్ధిదారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ దస్తగిరి, ఏపీఓ వసుధ మాట్లాడుతూ గోకులాలు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో షెడ్యూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు, నాలుగు, ఆరు పశువుల గోకులాల నిర్మాణాలకు వాటి కొలతల ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని తెలిపారు.మండలంలో 25 మినిగోకులా మంజూరైయ్యాయని తెలిపారు.రెండు పశువుల మినీ గోకులంకు 150000 వేల రూపాయలు, నాలుగు పశువుల మినీ గోకులంకు రు.1.85 లక్షల రూపాయలు ,ఆరు పశువుల మిని గోకులంకు రూ.2.30లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరుచేస్తుందన్నారు.లబ్ధిదారులు ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తంబిల్లులో10% చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.మినీగోకులం నిర్మాణం ప్రామాణికంగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మినీ గోకులం షెడ్యూల్ లబ్ధిదారులు ఈ సి వరదరాజులు,టెక్నికల్ అసిస్టెంట్లు మనోహర్,శ్రీనివాస రెడ్డి,స్వాములు,రామచంద్రుడు,రోజా, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!