
మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు అవగాహన
స్వానిధి భీ – స్వాభిమాన్ భీ పక్వాడా అవగాహన …మెప్మా
కల్లూరు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరపాలక సంస్థ పరిధి లో కల్లూరు,ఇందిరమ్మకట్ట యందు కల కమ్యూనిటీ హాల్ లో వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు స్వానిధి భీ – స్వాభిమాన్ భీ పక్వాడా అవగాహనా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా మెప్మా అధికారులు,బ్యాంక్ అధికారులు, పట్టణ సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ వీధివ్యాపారులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించుకొని వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.లావాదేవీలు అన్ని కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేయాలన్నారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన జీవన జ్యోతి భీమా,సురక్ష భీమా వంటివి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!