జాతీయ నులిపురుగుల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం

జాతీయ నులిపురుగుల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి ల ఆధ్వర్యంలో మండలంలోని పలు అంగన్వాడి కేంద్రాలు,ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మరియు ప్రైవేట్ స్కూలు కళాశాలలో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలను విద్యార్థిని విద్యార్థులకు సోమవారం రోజున వేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నిర్మూలనపై ఆరోగ్య విద్య అవగాహన కలిగించారు.నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత,పోషకాహార లోపం,ఆకలి మందగించడం,నీరసం,ఆందోళన, కడుపు నొప్పి,వికారం,వాంతులు, విరోచనాలు,బరువు తగ్గడం వంటివి జరుగుతాయని దీని నివారణకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలు వేసుకోవాలని వారు తెలియజేశారు.దీనివల్ల రక్త హీనతను నివారించవచ్చని తెలిపారు. అదనంగా వారానికి ఒకసారి గోళ్లను కత్తిరించుకోవాలని,శుభ్రమైన నీటిని తాగాలని,బయట తిరిగేటప్పుడు బూట్లు,చెప్పులు ధరించాలని,బహిరంగ మలవిసర్జన నివారించాలని, మలవిసర్జన తర్వాత భోజనాంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, చేతుల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు,ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ,సూర్య నారాయణ,హెల్త్ సెక్రటరీలు లక్ష్మి సువర్ణ హెల్త్ ప్రొవైడర్ అంజలి,జడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్ హాజారయ్య బాబు,కేజీబీవీ పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS