FlatNews Buy Now
పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన సదస్సు

పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన సదస్సు

అనంతపురం, న్యూస్​ వెలుగు: పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతిగృహం బుక్కరాయసముద్రం అనంతపురం జిల్లా నందు సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను ఏ విధంగా రాయాలి ఒత్తిడిని అధికమించి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో అనే విషయంపై ఏ ఎస్ డబ్ల్యూ ఓ రమణ  ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం విద్యార్థులకు డాక్టర్ పరమేష్ నాయక్ మోటివేషనల్ స్పీకర్ తో విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులో మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు సమయాన్ని వృధా చేసుకోకుండా ఫోన్లకు దూరంగా ఉండి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఆయా సబ్జెక్టులు వారిగా ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను పరీక్షల టైంలో అన్ని విషయాలను గుర్తుంచుకొని రాయడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు డాక్టర్ పరమేష్ నాయక్ విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ డబ్ల్యూ ఓ రమణ  విద్యార్థులు వసతి గృహం సిబ్బంది పాల్గొనడం జరిగింది.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS