మహిషాసుర వర్ధిని అలంకరణలో బాల గంగమ్మ

మహిషాసుర వర్ధిని అలంకరణలో బాల గంగమ్మ

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; మండలంలోని వీవర్స్ కాలనీలో ఉన్న బాల గంగమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు మహిషాసురమర్థినీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ముక్కులు తెచ్చుకున్నారు.అష్ట భుజాలతో దుష్టుడైన మ‌హిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టామని నిర్వాహకరాలు ఆదిలక్ష్మి తెలిపారు. ఈ కార్యకమాలను అంజనమ్మ రాములమ్మ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!