
500 నోటుతో జర జాగ్రత్త
నగదు లావాదేవీల్లో అప్రమత్తత అవసరం
న్యూస్ వెలుగు, కర్నూలు : రూ.500 నోట్లు తీసుకునేప్పుడు జర జాగ్రత్త. నకిలీ నోట్లు చెలామణీ నేరం. అయితే కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులకు తెలీకుండా లావీదేవీల్లో వారి చెంతకు నకిలీ నోట్లు చేరుతున్న సందర్భాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకుల్లో అయితే నోటును చించడం లేదా కాల్చడం చేస్తారు. అంతవరకు మంచిదే. తమకు తెలీకుండా తమ చెంతకు నకిలీ నోటు చేరితే అది నకిలీదని తెలియక వారు జరిపే లావాదేవీల్లో ఎక్కడన్నా ఆ నోటు నకిలీ నోటుగా అవతలి వారు గుర్తిస్తే నోటు ఇచ్చిన వ్యక్తి జవాబుదారీ అవుతారు. అసలు ఆ నోటు ఎవరు ఇచ్చారో గుర్తులేకుంటే చివరగా ఆ నోటు ఎవరి దగ్గర గుర్తిస్తే వారు బాధితులు, బాధ్యులు అవుతారు.
ఈ నేపథ్యంలో రూ.500 నోటుకు సంబంధించి అసలు నోటు అయితే ఈ కింద పేర్కొన్న 17 అంశాలు ఉంటాయి. నకిలీ కూడా దాదాపు అదే విధంగా వచ్చినా కొన్ని లోపాలు ఉంటాయని, అనుమానం వస్తే వెంటనే ఆ అంశాలను సరిపోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా నకిలీ నోట్లు వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
అసలు నోటులో ఉండే అంశాలు
1. 500 రూపాయల నోటు సంఖ్యలో కనిపించే పారదర్శకమైన రిజిస్టర్.
2. సంఖ్య గుర్తుకు సంబంధించిన గుప్తుమైన చిత్రం.
3. దేవనాగరి లిపిలో సంఖ్య గుర్తు గుర్తింపు.
4. మహాత్మాగాంధీ పోరె్ట్రయిట్ దిశ, సంబంధిత స్థానంలో మార్పు.
5. కంచెడు సెక్యూరిటీ ధ్రెడ్ కేవలం నోటును ఒత్తివేసినపుడు ఆకుపచ్చ నుంచి నీలంకు మారుతుంది.
6. గ్యారంటీ క్లాజ్, గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడి వైపుకు తిపబడినది.
7. నంబర్ ప్యానెల్ పెద్ద నుంచి చిన్నదిగా పెరుగుతున్న సంఖ్య గుర్తులతో పైన, కింద, పక్కన.
8. కుడి పక్కలో రూ. 500 సంఖ్య గుర్తులు ఉంటాయి.
9. అశోక చిలుక చిహ్నం కుడి పక్కలో కనిపిస్తుంది.:
10. మహాత్మాగాంధీ పోరె్ట్రయిట్, అశోక చిలుక చిహ్నం, గుర్తింపు చిహ్నం ఎత్తు పెరిగిన ముద్ర ఉంటుంది.
11. 500 ఎత్తు పెరిగిన ముద్రలో రౌండ్ చుట్టూ కనిపిస్తుంది.
12. కుడి, ఎడమ 5 పొడవైన ఎత్తు పెరిగిన రేఖలు.
13. ఎడమ వైపున ముద్రించిన సంవత్సరం
14. స్వచ్ఛభారత్ లోగో
15. భాషా ప్యానెల్ కేంద్రం.
16. భారత జాతీయ పతాకంతో రెడ్ పోర్ట్ చిత్రం.
17. నెంబరు, సంఖ్యా గుర్తు దేవనాగరి లిపిలో కుడిపక్కన.
ఈ 17 అంశాలను సరిపోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలానే డబ్బు లెక్కించే మిషన్ కూడా నకిలీ నోటును వెంటనే గుర్తిస్తుంది. అనుమానం వచ్చినపుడు ఏదో ఒక పద్ధతిలో సరిచూచుకోవాల్సిన అవసరం ఉంది.