
క్యాజువాలిటీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు
మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గ్రాండ్ రౌండ్స్ లో భాగంగా, శుక్రవారం పలు విభాగాలైన ఎం సి హెచ్, గైనిక్, న్యూరో సర్జరీ, యురాలజీ, నెఫ్రాలజీ ఓటి, నెఫ్రోప్లేస్, హౌస్ సర్జన్ క్వార్టర్స్ పలు ఓ.పి విభాగాలు అయిన మెడికల్, ఆర్తో, జనరల్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఓపి మరియు ఐ పి విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్వోడీ లను ఆదేశించినట్లు తెలిపారు. న్యూరో సర్జరీ ఓటి విభాగంలో ఏసీల మరమ్మతులను పూర్తి చేసినట్లు తెలిపారు అనంతరం నెక్స్ట్ వీక్ నుండి న్యూరో సర్జరీ కేసులు చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలలో సీలింగ్ మరమ్మతులను పూర్తి చేయాలని ఏపీ ఎం ఐ డి సి ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. క్యాజువాలిటీ విభాగంలోని పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మెషిన్ ను పరిశీలించారు అనంతరం ప్రతిరోజు ఎన్ని కేసులు స్కాన్లు చేస్తున్నారు అని ఆరా తీశారు. అనంతరం క్యాజువాలిటీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధించిన హెచ్విడి లను ఆదేశించారు. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసులను ఎవరైనా బయటికి పంపించినట్లు మా దృష్టికి వస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంలు, డా.శ్రీరాములు, డా.సీతారామయ్య, సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, న్యూ డయాగ్నస్టిక్ మెడికల్ ఆఫీసర్, డా.సునీల్ ప్రశాంత్, ఆసుపత్రి ఏడి, శ్రీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్, .సావిత్రి బాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు