
భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు
కర్నూలు, న్యూస్ వెలుగు; కోడుమూరు లోని పరప్పగోడన్ ను జిల్లా సంచార చికిత్స కార్యక్రమ నోడల్ ఆఫీసర్ డాక్టర్. రఘు ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడుతూ శివరాత్రి పాదయాత్ర పండుగ శ్రీశైలం వెళ్తున్న శివ భక్తుల కోసం 24 గంటలు వైద్య శిబిరన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తే వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాలనుండి మరియు అధికముగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రదేశముల నుండి భక్తులు దీక్షతో దాదాపు 600 నుంచి 800 కీ.మీ దూరము పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుంటారు. వీరందరిని మన రాష్ట్రానికి, మన జిల్లాకు అతిథులుగా భావించి వివిధ ప్రదేశాలలో అన్న దానము కార్యక్రమమును విరివిగా నిర్వహించుచున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున భక్తులకు మరియు దాతలకు ఈ క్రింద కనబరచిన ఆరోగ్య సలహాలు పాటించవలెనని కోరుతున్నాము. భక్తులకు ఆహారముతో పాటు పరిశుభ్రమైన నీటిని అందించడము మంచిది.
త్రాగు నీరు కలుషితము కాకుండా చూడాలి, చెంబులు, గ్లాసులు, మగ్గులు త్రాగు నీళ్ళలో ముంచరాదు.
త్రాగు నీరు శుభ్రమైన పాత్రలలో ఏర్పాటు చేసి వాటికి కుళాయి బిగించి వాడడము ద్వారానీరు కలుషితము అవకాశము ఉన్నచో దాతల సహకారముతో మినరల్ వాటర్ పాకెట్లు అందించండo చేయాలి. వేడి వేడి ఆహారపదర్థాములు మాత్రమే భక్తులకు వడ్డించవలెను.
భోజన పదార్ధములలో నూనెలు, మసాలాలు, కారము ఎక్కువగా వాడరాదు.
భోజన తయారు చేయు పాత్రలు ప్లేట్లు కాని గ్లాసులు కాని శుభ్రముగా వేడి నీళ్ళలో కడగవలెను.
భోజనము తయారు చేయువారు, వడ్డించు వాళ్ళు చేతులను శుభ్రముగా సబ్బుతో కడుగుకొనవలెను.
ఎండ తీవ్రతకు భక్తులు అలసిపోకుండా ఉండుట కొరకు ఉదయము 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు నిమ్మ రసం + చక్కర నీళ్ళ ద్రావణము మరియు మజ్జిగలో కొద్దిగా ఉప్పు కలిపి ఇవ్వవలయును.
ఎండలో నడిచే భక్తులు తలపై టోపీ కానీ టవల్ కానీ ధరించవలెను.
ఈ క్రింద కనబరచిన గ్రామములో ప్రథమ చికిత్స కేంద్రము ఏర్పాటు చేయడము అయినది. కావలసిన సేవలు ఆరోగ్య కార్యకర్తల ద్వార పొందవచ్చును .
1 రేమట 2..సి. బెళగల్ 3. పోలకల్ 4. గూడూరు 5 కోడుమూరు.6. పెంచికలపాడు 7. పెద్దపాడు 8.కల్లూరు బళ్ళారి చౌరస్తా9.గార్గయపురం 10. గోకులపాడు
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వస్త్యా కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్. శైలేష్ , కోలోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. మదన్ శేఖర్ , హెల్త్ సూపర్ వైజర్ కమాల్ సాహెబ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు మరియు జిల్లా ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.