
భగవద్గీత కంఠస్థ పఠణ పోటీలు
కర్నూలు న్యూస్ వెలుగు : గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న భగవద్గీత కంఠస్థ పఠణ పోటీలలో భాగంగా ఈ సంవత్సరము కర్నూలు జిల్లాకునవంబర్ 30వ తేదీ, ఆదివారం ఉదయం 9-00 గంటల నుండి కర్నూలునగరం, సి. క్యాంపులోని తి.తి.దే. కళ్యాణ మండపం నందు పోటీలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలుజిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను అచలానందాశ్రమం పీఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామీజీచే కర్నూలు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానములు కళ్యాణ మండపం నందు ఆవిష్కరించారు. విద్యార్థులకు బాల్యం నుండే భగవద్గీతను బాల్యంనందే నేర్పడం వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెరగడంతోపాటు, గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం జరిగుతుందని స్వామీజీ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు “ప్రతి ఇంటా భగవద్గీత – ప్రతి నోటా భగవద్గీత” అని సంకల్పించుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం పోటీల విధివిధానాలు మూడు విభాగాలుగా నిర్వహించనున్నారని, 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగము మొత్తం 27 శ్లోకాలు.,10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్ధులకు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము మొత్తము 24 శ్లోకాలు.,18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు వారికి “నిత్యజీవితంలో భగవద్గీత – భావ విశ్లేషణ” అనే అంశంపై ఈ పోటీలు కర్నూలు జిల్లాకు వారికి మాత్రమే నిర్వహించబడునని తెలిపారు. ప్రతి విభాగం నుండి విజేతలను గుర్తించి వారికి ప్రధమ బహుమతి రూ1116-00, ద్వితీయ బహుమతి రూ816-00, తృతీయ బహుమతి రూ516-00తోపాటు తితిదే నుడి ప్రశంసా పత్రము, జ్ఞాపికను బహూకరించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదా విష్ణు సహస్రనామ పారాయణ సంఘం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా,ధార్మిక సంస్థల ప్రతినిధులు తుమ్మేపల్లె శ్రీనివాసులు,ఆకుల జయకృష్ణ, ఎ. హరి, డి.వంశీ,కె. వేణుగోపాల్, నరహరి వెంకట రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే అభ్యర్థులందరూ ముందుగా తమ తమ పాఠశాలు, కళాశాలల నుండిగానీ, స్వయంగాగానీ విద్యార్థుల జాబితాను 9059802265 వాట్సాప్ నెంబర్ కు పంపవలెనని విజ్ఞప్తి చేశారు.

