
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు లో భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన కర్నూలు జిల్లా కురువ సంఘం. రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆదివారం పెనుగొండ లో బిసి సంక్షేమ మంత్రి సవితమ్మ నివాసంలో వినతిపత్రం అందజేసిన కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మహిళా అధ్యక్షురాలు శ్రీలీలమ్మ కె సి నాగన్న, తవుడు శ్రీనివాసులు ఉన్నారు. అధికారికంగా కనకదాసు జయంతిని కర్నూలులో జరపాలని కనకదాస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే నిర్వహించాలి. రాష్ట్రంలో ప్రధాన పట్టణాల్లో తిరుపతి, శ్రీశైలం, మహానంది, విజయవాడ, విశాఖపట్నం ముఖ్య పట్టణంలో కనకదాసు భవనాలను నిర్మించాలని కోరారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist