భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: శ్రీశ్రీశ్రీ భక్త కనకదాసు జయంతి ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సంగోళి రాయన్న సేన నాయకులు మంగళవారం రోజున నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి కు వినతిపత్రంను అందజేశారు.ఈ సందర్భంగా వారు ఎంపీతో మాట్లాడుతూ కురువల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస జయంత మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి,భక్త కనకదాసు రాష్ట్ర కార్యక్రమాన్ని కర్నూల్ లోనే నిర్వహించాలని,అన్ని ప్రభుత్వ సంస్థలలో కనకదాస జయంతిని నిర్వహించి,కనకదాసు జయంతి రోజున సెలవుదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు ఎంపికు తెలియజేశారు.అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస భవనము,మ్యూజియం, విద్యాసంస్థలను కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఎంపీకు వారు సమన్వయంగా విన్నవించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీకు జాతీయ సంగోలి రాయన్న సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగోలి రాయన్న సేన ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్,కురువ సంఘం అధ్యక్షులు తవుడి శీను,రంగస్వామి, తడగనపల్లె లాలు పెద్దపాడు శివ నారాయణ,పురుషోత్తం,శివయ్య,రామ్ కుమార్,డాక్టర్ మద్దిలేటి,మాదాసి కురువ డైరెక్టర్ ఈశ్వరయ్య,నాగరాజు చంద్రశేఖర్,మనోహర్, రామాంజనేయులు,నాగరాజు,ఉల్చాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.