భక్త కనకదాసు జయంతి ను అధికారికంగా నిర్వహించాలి

భక్త కనకదాసు జయంతి ను అధికారికంగా నిర్వహించాలి

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: భక్త కనకదాసు జయంతి ను అధికారికంగా నిర్వహించాలని సంగోళి రాయన్న సేన నాయకులు గురువారం రోజున కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుకు వినతిపత్రం ను అందజేశారు.ఈ సందర్భంగా వారు ఎంపీ తో మాట్లాడుతూ కురువల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస జయంత మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి,భక్త కనకదాసు రాష్ట్ర కార్యక్రమాన్ని కర్నూల్ లోనే నిర్వహించాలని,అన్ని ప్రభుత్వ సంస్థలలో కనకదాస జయంతిని నిర్వహించి,కనకదాసు జయంతి రోజున సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు ఎంపికు తెలియజేశారు.అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస భవనము,మ్యూజియం, విద్యాసంస్థలను కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఎంపీకు వారు సమన్వయంగా విన్నవించారు.దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు తగిన గుర్తింపు ఇచ్చి వారి పేరు మీద తగిన సంస్థలను నెలకొల్పాలని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి మాట్లాడతానని ఎంపీ భరోసానిచ్చినట్లు వారు తెలియజేశారు.
కర్నూలు ఎంపీకు జాతీయ సంగోలి రాయన్న సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగోలి రాయన్న సేన ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్,కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీపురం మురళీమోహన్, మధుసూదన్,బండారి శ్రీనివాసులు, రాయలసీమ రవి ఎంకే సుంకన్న,లాలు, శివ నారాయణ,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!