ఘనంగా భక్త కనకదాస జయంతి మహోత్సవం
కనకదాస 537 జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషకరం.
ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: భక్త కనకదాస 537 జయంతి మహోత్సవాలను అనంతపురం నందు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు అన్నారు. సోమవారం కర్నూల్ లోని బీసీ భవన్ నందు కనకదాసు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష,జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మమ్మ,కల్లూరు మండల తహాసిల్దార్ ఆంజనేయులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కమిటీ హాల్ నందు కనకదాస జయంతి ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ కురువలకు ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు గురించి పలు విషయాలను తెలియజేసి,కురువలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని,ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని మరియు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఊరిలో గొర్రెలకు నీటి కుంటలు ఉండేలాగా,గొర్రెలకి ఇన్సూరెన్స్ ఉచితంగా చేసేలాగా ప్రభుత్వాధికారులతో చర్చిస్తామని ఆయన తెలియజేశారు.50 సంవత్సరాలు పైబడ్డ గొర్రెల కాపరులకు పెన్షన్ అమలయ్యేలాగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ భక్త కనకదాసు లాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని యువత పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన తెలియజేశారు.కురవలు ఆర్థికంగా, రాజకీయంగా మరియు సామాజికంగా ఎదగాలని ఆయన తెలియజేశారు. భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అనంతపురంలో నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన తెలియజేశారు.రాష్ట్రంలోని గల కురవలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జాతీయ సంగోళి రాయన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్, డోన్ నియోజకవర్గం అధ్యక్షులు మధు, కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాముడు,ఉదయ్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, డైరెక్టర్ ఎంకే మద్దిలేటి,చంద్ర మరియు పర్ల పెద్దమీన్,మాదాసి కురువ రాష్ట్ర అధ్యక్షులు తిరుమలేష్,మల్లికార్జున, పురుషోత్తం,యుగంధర్,చంద్రశేఖర్,బీసీ సంఘం నాయకులు బత్తుల లక్ష్మీ నారాయణ,ధనుంజయచారి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.