
దేవరగట్టులో రక్త పట్టు
బన్నీ ఉత్సవాల్లో కొనసాగిన సాంప్రదాయిక ఆచారం,
గాల్లోకి ఎగిసిపడ్డ కాగడాలు
92 మందికి గాయాలు,15 మంది పరిస్థితి విషమం
జైత్రయాత్రలో పగిలిన తలలు
దగ్గరుండి ఉత్సవాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్,సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఉత్సవాలు తిలకించేందుకు తరలివచ్చిన లక్షలాది మంది భక్త జనం
రమణీయం శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం.
హొళగుంద, న్యూస్ వెలుగు; దేవరగట్టు బన్నీ ఉత్సవాలను భక్తులు,ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని నెల రోజుల పాటు అవగహన సదస్సులు జరిపిన ప్రజలు మాత్రం పట్టు వదలకుండా తమ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు
డిర్ర్….డిర్ర్….గోపరక్ అంటూ నినాదాలు చేస్తూ కాగడలు,కర్రలను చేత పట్టుకొని.శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత దేవరగట్టుల్లో కర్రల సమరం కొనసాగింది.భక్తులు చేత పట్టిన కర్రలు కరాళ నృత్యం చేశాయి.ఈ సందర్భంలో భక్తుల తలలు పగిలి రక్తమోడిన భక్తులు మాత్రం జైత్రయాత్ర నుండి వెనుకడుగు వేయలేదు.ఆదివారం తెల్లవారేవరకు….మాత మాళమ్మ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహా మూర్తులు సింహాసన కట్ట చేరెవరకు భక్తులు కర్రల సమరాన్ని ప్రదర్శించారు.సంప్రదాయ ఉత్సవాన్ని కొనసాగించారు.
■హోళగుంద, న్యూస్:విజయదశమి సందర్భంగా హోళగుంద మండలంలో రాష్ట్రానికి ప్రసిద్ధిగాంచిన దేవరగట్టుల్లో జరిగే కర్రల సమరంలో సంప్రదాయం కొనసాగింది.శనివారం అర్థరాత్రి ప్రారంభమైన శ్రీ మాళ సహిత మల్లేశ్వరుని జైత్రయాత్ర ఎప్పటిలాగే బన్నీ ఉత్సవాలో రక్తమోడింది.మొత్తం 92 మందికి గాయాలయ్యాయి. 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.ఉత్సవాలు నిర్వహించే ప్రధాన గ్రామలైన నెరణికి,నెరణికి తండా,కొత్తపేట గ్రామస్థులతో పాటు దేవరగట్టు పరిసర గ్రామలైన సులువాయి, విరుపాపురం,ఎల్లార్తి,అరికేర,లింగంపల్లి,కురుకుంది గ్రామలతో పాటు దాదాపు 15 గ్రామ ప్రజలు బన్నీ ఉత్సవాలో పాల్గొని మొగలాయి ఆడారు.ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తెలంగాణ,మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు గట్టుకు తరలి వచ్చారు.
పాల బాస చేసి ఉత్సవాలోకి
శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర (ఊరేగింపు)కు పాల్గొనే ముందు మాత మాళమ్మ,మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించడానికి నేరణికి, నేరణికి తండా,కొత్తపేట గ్రామస్థులు శనివారం రాత్రి 12:30 గంటలకు డొళ్లిన బండే (చెరువు కట్ట) వద్దకు చేరుకున్నారు.అలాగే పాత కక్షలు,వ్యక్తిగత మనస్పర్థలు, వైశ్యమ్యాలను విడి కలిసి కట్టుగా ఉత్సవాలు జరుపుకుందామని మూడు గ్రామస్థులు పాల బాస తీసుకున్నారు.తదనంతరం ఆయా గ్రామాల పెద్దలు అర్ధరాత్రి 12 గంటలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్,సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ లకు బండారాన్ని ఇచ్చి స్వామి, అమ్మ వార్ల కల్యాణానికి అనుమతి కోరారు.ఇందుకు వారు అనుమతి ఇవ్వడంతో కల్యాణోత్సవం నిర్వహించడానికి బయలుదేరారు.
రమణీయం శ్రీమాత మాళమ్మ,మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం
డోళ్ళు,మేళతాలతో కర్రలను, అగ్గి కాగడాలను చేత పట్టుకొని నేరణికి,నేరణికి తండా,కొత్తపేట గ్రామస్తులు గిరి(కొండా) పైకి చేరారు.అక్కడ స్వామి అమ్మవార్లకు భక్తుల జయ జయ ధ్వనుల మధ్య మాత మాళమ్మ,మల్లేశ్వరునికి ఆలయ అర్చకులు రవిశాస్త్రి కల్యాణోత్సవం జరిపించారు.అనంతరం స్వామీ, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా సింహాసన కట్ట వద్ద తీసుకువచ్చారు.ఈ సందర్భంలో పట్ పట్ మనే కర్రల శబ్దంతో డిర్ర్…డిర్ర్..గోపరక్ అంటూ ఉత్సవ విగ్రహాలను సింహాసన కట్ట మీద అధిష్టించారు.అనంతరం అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలైంది.అలాగే ఉత్సవాలను తిలకిస్తున్న భక్తుల ఒళ్లు గుగుర్పొడిచే విధంగా ఉత్కంఠంగా ముందుకు సాగింది.అలా సింహాసన కట్ట నుంచి ఎదురు బసవన్న గుడివరకు కొద్ది సేపు అలజడి సృష్టించి ముందుకు సాగుతుండగా భక్తులకు కర్రలు తగిలి భక్తుల తలలు పుచ్చకాయల పగిలాయి.
ఉత్సవాలు ప్రారంభానికి ముందే చిందిన రక్తం
బన్నీ ఉత్సవాలో శనివారం అర్ధరాత్రి జైత్రయాత్రకు ముందే చాలా మందికి తలలు పగిలాయి.అనంతరం జరిగిన జైత్రయాత్రలో మొత్తం 92మంది భక్తులకు రక్త గాయాలయ్యాయి.వివిధ గ్రామాలకు చెందిన 15భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారికీ హెల్త్ క్యాంపులో ప్రథమ చికిత్స కోసం వైద్యులు ఆలూరు,అదోనికి రెఫర్ చేశారు.గాయపడిన క్షతగాత్రులకు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు.
జైత్రయాత్ర జరిగిందిలా……
అర్థరాత్రి 12:30 గంటలకు నేరణికి,నేరణికి తండా,కొత్తపేట గ్రామ ప్రజలు డోళ్లబండ చేరుకున్నారు.ఒకే మాటగా…ఒకే బాటగా దేవుడి కార్యాన్ని విజయవంతం చేద్దామని పాల బాసలు చేశారు.కర్రలు,కాగడాలు చేతపట్టి గట్టు వైపు సాగారు.12:50గంటలకు డిర్ర్..గోపరక్ అంటూ వేలాది భక్తజనం నిమిషాల్లో 800 ఎత్తు కొలువైన స్వామివారి ఆలయానికి చేరారు.పచ్చని కొండ,చెట్ల మధ్య ఎటుచూసినా బగ్గుమనే కాగడల వెలుతురు.స్వామి,అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.స్వామివారి కల్యాణం చిహ్నంగా ఐదు ఔటు (బాణం) పేల్చారు.ఉత్సవ మూర్తులతో కొండ దిగువ ఉన్న సింహాసన కట్టకు చేరుకున్నారు.నేరణికి, నేరణికి తండా,కొత్తపేట గ్రామస్థులు ఉత్సవ మూర్తులకు రక్షణగా నిలిచి బన్నీ ఉత్సవాన్ని ఆరంభించారు.భక్తులు తలకు టవల్ చుట్టి, కర్ర చేతపట్టి సమరంలో పాల్గొన్నారు.చూసే భక్తులు బండారం(పసుపు) దేవుని పై చలారు.పసుపువర్ణంలో కాగడల వెలుతురులో సాగిన బన్నీ ఉత్సవం కర్రల యుద్ధాన్ని తలపించింది.1:45 గంటల సమయానికి ఉత్సవ మూర్తులతో ఆ మూడు గ్రామాల భక్తులు పాదాలగట్టు, ముళ్లబండ,రక్షపడి, శమివృక్షం పూజలు నిర్వహించేందుకు అడవిలోకి వెళ్లడంతో కర్రల సమరం ముగిసింది.కారుచికట్లు కమ్ముకున్న అడవిలో 5 కి.మీ నడిచి వెళ్లి పూజలు నిర్వహించారు.ఆదివారం ఉదయం 6:00 గంటలకు ఎదురు బసవన్న గుడికి చేరుకున్నారు.అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు గిరిస్వామి భవిష్యవాణి వినిపించారు.అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను సింహాసన కట్టకు ప్రశాంతమైన వాతావరణంలో చేరాయి.15 గ్రామాల భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని దైవకార్యని జయప్రదంగా ముగించారు.
నేడే రథోత్సవం.
దేవరగట్టులో నేడు సాయంత్రం 5 గంటలకు శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు.15న గోరవయ్యల ఆట,గొలుసు తెంపుట,దేవదాసి క్రీడోత్సవం,సాయంత్రం వసంతోత్సవం,కంకణ విసర్జన జరుగుతుంది.16న శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలు నేరణికి గ్రామానికి చరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
మోహరించి పోలీస్ బలగాలు
జిల్లాధికారులు కర్రల సమరంలో రక్తపాతాని తగ్గించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు.జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నేతృత్వంలో డిఎస్పీలు,సిఐలు,ఎస్ఐలు,స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 800 మంది బందోబస్తు నిర్వహించారు.అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలు,వందలాది సిసి కెమెరాలు,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండెంట్ సెంటర్,పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.అలాగే దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేశారు.
రాక్షసులకు రక్తతర్పణం
శ్రీ మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవాలోని జైత్రయాత్రలో భాగంగా దట్టమైన అడవిలో 5 కి.మీ దూరంలోని రక్షపడి గుండు వద్దకు చేరుకున్నారు. అక్కడ కంచబీర వంశానికి చెందిన బసవరాజు అనే భక్తుడు తన ఎడమ కాలు పిక్కలు నుంచి డబ్బణంను గుచుజుకుని వచ్చిన రక్తాని మణి,మల్లసూరులుగా పిలిచే రాక్షస గుండ్లకు సమర్పించాడు(విసరడం).అక్కడి నుంచి శ్రీ మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను శమివృక్షం వద్దకు తీసుకెళ్లారు.ఉత్సవాలో పాల్గొన్న భక్తుల కర్రలు,ఆయుధాలను ఉంచి ఆ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శమివృక్షం మీదుగా శ్రీ మాళ మల్లేశ్వరస్వామి విగ్రహాలతో ఎదురు బసవన్న గుడి వైపుకు బయలుదేరారు.అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు భవిష్యవాణి(కర్ణికం) వినిపించారు.
మెరుగైన వైద్య సేవలు
ఉత్సవాల్లో గాయాలపాలైన భక్తులకు మెరుగైన చికిత్స అందించడం కోసం హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారు.ఉత్సవాల్లో 92 మందికి గాయాలయ్యాయి.15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వీరికి మెరుగైన వైద్య సేవల కోసం ఆదోని,ఆలూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
బన్నీ ఉత్సవాల్లో భక్తులు త్రాగునీటి కోసం అవస్థలు
బన్నీ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా మరియు ఉత్సవాల కమిటీ గత నెల రోజుల నుంచి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయితే ఉత్సవాల్లో ఉన్నతాధికారులు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ భక్తులకు త్రాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైయ్యారు.ప్రధానంగా ఉన్న త్రాగునీటి ట్యాంక్ నందు నీళ్లు నింపకపోవడంతో భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు ట్యాంక్ పై ఎక్కడంతో భక్తులు త్రాగునీటి కోసం అవస్థలు పడ్డారు.
అందరి కృషితో ఉత్సవాలు విజయవంతం
భక్తుల్లో చాలా మార్పు వచ్చింది.పోలీసులు,మిగతా శాఖల అధికారుల సమన్వయంతో పాటు దేవరగట్టు పరిసర గ్రామాల ప్రజల కృషితో ఉత్సవాలు గతేడాదిలా ఈ సారి ప్రశాంతంగా,అత్యంత భక్తి భావంతో,విజయవంతం అయింది.
-ఎస్పి బిందు మాధవ్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. భవిష్యవాణి వినిపించిన దేశానికి మల్లెపూలు చెల్లింది. నగహళ్లి పత్తి రూ. 6700 జొన్న రూ.3400 3….6 6…3 క్గోపరక్ అన్నారు .రక్తపడి చేరుకొని గురవయ్య బసవరాజు కాలు తొడ నుంచి ఇనుపడ్డబడంతో పుచ్చుకొని పసుపు దారంతో తీసి ఏడు చుక్కలు రక్తాన్ని రక్షపటికి అందించే పురాతన కాలం నుంచి అమావాస్యగా వస్తుందన్నారు