
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బొందిమడుగుల రమేష్
ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ ను ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ శుక్రవారం రోజున మర్యాదపూర్వకంగా ఎస్పీ కార్యాలయం నందు కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ఆదోని పత్తికొండ డివిజన్ పరిధిలో కోసిగి,కౌతాళం, నందవరం,హొలగుంద,ఆస్పరి,ఆలూరు, దేవనకొండ,హాలహర్వి,పెద్ద కడుబూరు మండలాల్లో కుల వివక్షత అధికంగా ఉందని,కుల వివక్షత అంటరానితనంతో దళితులే లక్ష్యంగా పెత్తందారి కులానికి చెందినవారు దాడులు చేస్తూన్నారని, దాడులకు గురై బాధింపబడిన దళిత బాధితులు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడానికి పోతే సత్వరమే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ చట్టాన్ని నీరుగారిస్తూ దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని,దళితుల ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి అనంతరం బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ కు ఆయన తెలియజేశారు.అలాగే పై తెలిపిన మండలాలపై ఎస్పీ ప్రత్యేకంగా నిఘా ఉంచి దళితులపై దాడులు జరగకుండా నివారణ చేపట్టేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు పరిచి,గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి స్వేచ్ఛ సమానత్వం కొరకు కృషి చెయ్యాలని ఎస్పీకు ఆయన తెలియజేశారు.స్పందించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ దళితులపై దాడులు చేస్తే ఉపేక్షించమని,చట్టపరంగా ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని, కుల వివక్షత,అంటరానితనం నిర్మూలనకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవిందు మాదిగ,కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాదిగ,కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ పరిధింపాడు మధు మనోహర్ మాదిగ,లింగన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.