
చెత్త బుట్టలను పంపిణీ చేసిన బొందిమడుగుల సర్పంచ్ చౌడప్ప
తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలం పరిధిలోని గల బొందిమడుగుల గ్రామంలోని పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొందిమడుగుల గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ యండ చౌడప్ప నేతృత్వంలో గ్రామ సర్పంచ్ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ ఆద్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్న వెంకటేష్ సమక్షంలో చెత్త సేకరణ బుట్టలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు ప్రతి ఇంటికి రెండు బుట్టలు ఇవ్వడం జరిగిందని,ఒక బుట్టలో తడి చెత్తను, మరొక బుట్టలో పొడి చెత్తను వేసి ఉంచితే గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులు గ్రామ ప్రజల ఇంటి దగ్గరకు వచ్చి చెత్తను సేకరిస్తారని వారు తెలియజేశారు.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండ చెత్త బుట్టలను సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో బొందిమడుగుల గ్రామ పారిశుద్ధ్య కార్మికులు రాజ శేఖర్,సామేలు, మద్దిలేటి,గ్రామ ప్రజలు,మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu