యూనియన్ బ్యాంక్ ద్వారా పొదుపు సంఘాలకు విరివిరిగా రుణాలు

యూనియన్ బ్యాంక్ ద్వారా పొదుపు సంఘాలకు విరివిరిగా రుణాలు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; పొదుపు మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తామని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆర్ఏబి హెడ్ పాండే తెలిపారు. శనివారం బండి ఆత్మకూరు మండలంలోని పొదుపు కార్యాలయంలో ఏపీఎం రామ శేఖర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ బండి ఆత్మకూరు శాఖ మేనేజర్ రవీంద్ర తో కలిసి పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ
పొదుపు మహిళలకు విరివిరిగా రుణాల అందజేస్తామని పది లక్షల వరకు ఎటువంటి సర్వీసు చార్జీలు వసూలు చేయమని, రూ.20 లక్షలు రూపాయల వరకు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారం చేసే మహిళలకు 10 లక్షల వరకు రుణాలు అందజేస్తామని యూనియన్ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
రూ.20 రూపాయలు చెల్లించడం ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తామని, రూ.436 చెల్లించడం ద్వారా ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా అందించినట్లు తెలిపారు. అలాగే పొదుపు సంఘాలకు, మహిళలకు బ్యాంకు సేవలో సులభతరం అయ్యేలా మండల పొదుపు కార్యాలయంలోనే బ్యాంక్ కరస్పాండెంట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు సుబ్బయ్య, రహెల్ బాషా,పొదుపు మహిళలు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!