దేవాలయానికి వెళ్ళే భక్తులకు సిమెంట్ బ్రిడ్జి నిర్మించండీ
హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులకు మరియు రైతులకు కాలువ దాటే శిథిలమైన ఐరన్ బిడ్జికి బదులుగా సిమెంట్ బిడ్జి నిర్మించాలని గురువారం శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి సేవ సమితి సభ్యులు ఎల్ఎల్సి జేఈ వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నిర్మించిన ఐరన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియక బ్రిడ్జి దాటడానికి భక్తులు మరియు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కావున సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకుపోయి సిమెంట్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద్,మహేష్,శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు మల్లప్ప టీచర్,ఉమేష్,సుదర్శన్ శెట్టి,కుబేర,శేఖర,రఘు,సాయి బేషు,మంజు,రాజా,దుర్గప్ప,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!