కుందు బ్రిడ్జిపై రక్షణ గోడ నిర్మించండి
బ్రిడ్జిపై నడిచి వెళ్లాలంటే భయం గుప్పెట్లో ప్రజలు, వాహనదారులు..
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండల కేంద్రమైన బండి ఆత్మకూరు గ్రామంలో కి వెళ్లాలంటే గ్రామ సమీపంలో గల కుందూ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది బ్రిడ్జిపై ఎలాంటి రక్షణ గోడ లేకపోవడంతో రాత్రి సమయాల్లో వాహనదారులు ప్రజలు భయపడుతున్నారు. ప్రతిరోజు ఈ బ్రిడ్జి మీద బండి ఆత్మకూరు గ్రామ ప్రజలు, కాలేజీకి, పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాకునూరు, ఎర్రగుంట్ల, కరిమద్దెల గ్రామాల ప్రజలు ప్రతిరోజు వందలాది సంఖ్యలో ఈ బ్రిడ్జి దాటుకుని వెళ్లాలి. కుందూ నది నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో రక్షణ గోడ లేక చాలామంది భయపడుతూ ఈ బ్రిడ్జిని దాటవలసి వస్తుంది. చిన్నపిల్లలు బ్రిడ్జిపై వెళ్లాలంటే భయపడుతూ తల్లిదండ్రుల సహాయంతో వెళ్లాల్సి వస్తుంది. దాదాపు 100 మీటర్ల పొడవున ఉన్న బ్రిడ్జికిక ఇరువైపుల రక్షణ గోడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయంలో బ్రిడ్జిపై ఎలాంటి విద్యుత్ బల్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు ఇవన్నీ చూస్తూ కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బ్రిడ్జి పై రక్షణ గోడ, విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.