
పెట్రేగుతున్న దొంగలు
మండల కేంద్రంలో వరుస ఘటనలు
కొరవడిన పోలీసు నిఘా. 
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు.వరుస దొంగతనాల ఘటనలతో మండల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.మండలంలో ద్విచక్ర వాహనాలు,పంట పొలాల్లోని మోటార్లు,కేబుళ్ళు చోరీకి గురవుతున్నాయి అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వారం క్రితం స్థానిక సినిమా రోడ్డులో ఒక వ్యక్తి యొక్క ద్విచక్ర వాహనం దొంగలించిన సంఘటన మండలంలో కలకలం రేపింది.ఈ ఘటన మరవకముందే మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి పొలంలోని మోటార్ ను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి దొంగలించారు.బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు తన పొలంలో ఉండాల్సిన మోటార్ లేకపోవడంతో ఖంగుతిన్నాడు.తన పొలంలోని మోటారు దొంగలించబడిన విషయం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసు సిబ్బంది మోటార్ దొంగలించబడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.గత రెండు సంవత్సరాల నుండి మండలంలో పొలాల్లోని మోటార్లు,కేబుళ్లు,ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. ప్రజలు తమ ద్విచక్ర వాహనాలను రాత్రి సమయాల్లో ఇంటి బయట నిలపడానికి భయపడుతున్నారు. పోలీసులు వరుసగా జరుగుతున్న దొంగతనాల పై నిఘా పెంచి చోరీకి పాల్పడుతున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda