
బస్సు బైక్ ఢీ
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకునికి గాయాలు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాతన గ్రామ బస్టాండ్ సమీపంలో శనివారం రోజున ద్విచక్ర వాహనం బస్సు ఢీకొన్నాయి. పత్తికొండ వైపు వెళ్తున్న బస్సు తుగ్గలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బస్సు ఢీ కొనడంతో పగిడిరాయి కొత్తూరు గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) కాలికి తీవ్ర గాయమయ్యింది.మెరుగైన చికిత్స కొరకు అంబులెన్స్ ద్వారా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Was this helpful?
Thanks for your feedback!