బురుజులలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: వైద్యాధికారుల ఆధ్వర్యంలో బురుజుల గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీను శుక్రవారం రోజున నిర్వహించారు.మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ రాగిణి,డాక్టర్ శ్రీ లక్ష్మి ఆదేశానుసారం జాతీయ అసంక్రిమిత వ్యాధుల నియంత్రణ 3.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్దికేర మండలం బురుజుల గ్రామంలో క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం అనే నినాదంతో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చని క్షేత్రస్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్లు, హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్,సర్వైకల్ క్యాన్సర్,నోటి క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.అనంతరం బురుజుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్ గీతాంజలి,సచివాలయ కార్యదర్శి సరస్వతి,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలతో ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కలిగించి అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.