
పేపర్ లీక్ పై మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ సంచలనంగా మరి రాజకీయ దుమారం లేపింది. దీంతో పెద్ద ఎత్తున విద్యార్ది సంఘాలు , నాయకులు నిరసన కార్యక్రమాలను ఉదృతం చేశారు. ఈ ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయగా కేసును సిబిఐ కి అప్పగిచ్చింది . దీంతో బీహార్‌లో నీట్-యుజి ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కేసులో 13 మంది నిందితులపై సిబిఐ తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ స్కాం సూత్రధారి మనీష్ ప్రకాష్, సికిందర్ యాద్వెందులతో పాటు మరో 11 మందిపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 201, 409, 380, 411, 420 మరియు 109 కింద కేసులు నమోదు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. NEET-UG పేపర్ లీక్ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) వ్యవస్థీకృత అంతర్ రాష్ట్ర ముఠాను రట్టు చేసింది. మొదట ఈ ఏడాది మేలో పాట్నాలోని శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది, అయితే జూన్ 23న సీబీఐకి బదిలీ చేయబడింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించేందుకు సీబీఐ అధునాతన ఫోరెన్సిక్ టెక్నిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీటీవీ ఫుటేజీలు, టవర్ లొకేషన్ అనాలిసిస్ మరియు ఇతర సాధనాలను ఉపయోగించుకుంది.
ఈ కేసులోని ఇతర నిందితులు, అనుమానితులపై సీబీఐ తదుపరి విచారణ కొనసాగిస్తోందని తెలిపింది. ఇందులో బాగంగా పలువురు నిందితులు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నిందితులు మరియు అనుమానితులపై తదుపరి దర్యాప్తు పూర్తయిన తరువాత కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు, ఈ కేసులో 40 మంది నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి, ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. సిబిఐ 58 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి , పరీక్ష తేదీకి ముందు జార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు దర్యాప్తు బృందం తేటతెల్లం చేసింది.