రాంపల్లిలో ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని టిడిపి నాయకులు మండల టిడిపి కన్వీనర్ రాంపల్లి ఆర్ తిరుపాల్ నాయుడు ఆద్వర్యంలో గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం రోజున పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల టిడిపి కన్వీనర్ ఆర్.తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాలకు ఆయువు పట్టు అయిన గ్రామాలు అభివృద్ధి చెందిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ప్రకారంగానే గ్రామాల అభిృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ చొరవతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ సుమన్,గ్రామ ప్రజలు టిడిపి కార్యకర్తలు చిన్న ఓబులేసు,హోసూరు క్రిష్ణా రెడ్డి,దబ్బలు రామాంజినేయులుసంఘాల రామాంజినేయులు,పెద్ద తిమ్మప్ప, బొగ్గుల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.