అంగన్వాడి కార్యకర్త శిక్షణ తరగతులను పరిశీలించిన సిడిపిఓ

అంగన్వాడి కార్యకర్త శిక్షణ తరగతులను పరిశీలించిన సిడిపిఓ

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ సిడిపిఓ శశికలమ్మ అంగన్వాడి కార్యకర్తలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు.ముందుగా 3వ రోజు శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఉపాధ్యాయులు ధనుంజయ,శేఖరప్ప,రేణుక అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం సిడిపిఓ శశికలమ్మ ఎంపిడిఓ విజయలలితతో సమావేశమై అంగన్వాడి కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించి,ఆధార్ కార్డు కోసం ఇబ్బందులు పడుతున్న వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.అలాగే అంగన్వాడి కేంద్రాల బలోపేతం చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ సూపర్ వైజర్ శిబా రాణి,అంగన్వాడి కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!