బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహా ఉత్సవాన్ని జయప్రదం చేయండి
హొళగుంద,న్యూస్ వెలుగు; నియోజకవర్గ శ్రీ.బెళ్ళుగుండు శ్రీ.ఆంజనేయస్వామి దేవాలయం నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం APVBS ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరిగే బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహా ఉత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.మంగళవారం హోళగుంద మండలం స్థానిక వాల్మీకి సర్కిల్ శ్రీ.వాల్మీకి మహర్షి విగ్రహం నందు బోయ వాల్మీకి కార్తీకమాస వనభోజన మహోత్సవ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ. ఆలూరు నియోజకవర్గంలో బోయ వాల్మీకి కార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హోళగుంద మండల చుట్టుపక్కల గ్రామాల్లో బోయ వాల్మీకి పెద్దలు యువకులు మహిళలు అందరు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో APVBS మండల అధ్యక్షుడు దిడ్డి తిక్కస్వామి పెద్దహ్యట పి.శ్రీరంగ కోగిలతోట రంగన్న రారాయి సిద్ధూ సింధువాళ్ళం కృష్ణ ఈరత్నహాల్ అశోక్ బుడ్డన్న గోరేశ్ మహేష్ బసవరాజ్ దిద్ది సిద్ధ గంగన్న వందవగిలి తిమ్మప్ప కర్లింగ పెద్దహ్యట రాము పేన్నయ్య మల్లి ఎల్లప్ప వాల్మీకి కుల పెద్దలు ఏరిస్వామి మల్లయ్య షణ్ముఖ పాల్గొన్నారు.